బాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో భాగంగా ఎన్సీబీ నుంచి సమన్లు అందుకున్న దీపిక పదుకోన్ శనివారం ముంబైలోని ఎన్సీబీ అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపిక పలు కీలక విషయాలు బటపెట్టినట్టు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. దీపిక తన మేనేజర్‌తో జరిపిన డ్రగ్స్ చాట్ బయటికి వచ్చేసిందని తెలిసింది.
దీంతో దీపిక ఫోన్‌ని ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారట. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన నరౌత్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నా తర్వాత పునరావృతం చేయండి.. మాదకద్రవ్యాల దుర్వినియోగం యొక్క పరిణామం. హూ క్లాస్ సొసైటీకి చెందిన పిల్లల మని చెప్పుకునే వారి మేనేజర్‌ను `మాల్ హై క్యా` అని అడగండి. #boycottBollywoodDruggies #DeepikaPadukone` అంటూ కంగన చేసిన ట్వీట్ బాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.