హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాత్రంతా జేసీబీలను వర్సిటీ లోనికి పంపించి అక్కడున్న దట్టమైన చెట్లను నరికి వేయించింది. దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ.. రాత్రంతా జేసీబీలతో పనులు చేయడం వలన నెమళ్ళు,పక్షులు రాత్రంతా అరుస్తూనే ఉన్నాయి. కోర్టులో అనేక మంది పిటిషన్స్ వేశారు. కోర్టుకు సెలవులు ఉండటంతో అదే అదనుగా చూసుకొని మొత్తం చెట్లను కొట్టేస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగొచ్చు కదా ?? ఎందుకు అంత హడావిడిగా పనులు చేస్తున్నారు? అని HCU విద్యార్థిని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రాత్రంతా జేసీబీ లతో పనులు చేసారు.. నెమళ్ళు, పక్షులు రాత్రంతా అరుస్తూనే ఉన్నాయి.
కోర్టులో అనేక మంది పిటిషన్స్ వేశారు, కోర్టు సెలవులు ఉండటంతో అదే అదనుగా చూసుకొని మొత్తం చెట్లను కొట్టేస్తున్నారు.
కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగొచ్చు కదా ?? ఎందుకు అంత హడావిడిగా పనులు చేస్తున్నారు ??… pic.twitter.com/G3lGrA9eSh
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) March 31, 2025