జగిత్యాల జిల్లాలోని నర్సింగాపూర్ శివారులో గల 90 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. దీని విలు కోట్లల్లో ఉంటుందని స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని కూడా చూడకుండా కబ్జారాయుళ్లు దానిపై కన్నేసినట్లు తెలిసింది.
అంతేకాకుండా అక్రమంగా పట్టా కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ భూముల కబ్జాపై గ్రామస్థులు పోరాటానికి దిగారు.కబ్జాదారుల వెనుక పలువురు కీలక రాజకీయ నాయకులు ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ భూముల కబ్జాపై అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపాలని స్తానికులు డిమాండ్ చేస్తుండగా.. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించనట్లు సమాచారం.