ఏపీ రైతులకు శుభవార్త..25 ఏళ్లు ఉచిత విద్యుత్‌

-

ఏపీ రైతులకు శుభవార్త. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో రానున్న 25 ఏళ్ల పాటు రైతులకు నమ్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అదే విధంగా డాక్టర్ వైయ స్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరాపరాపై అధికారులతో మంత్రి సోమవారం టెలికాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7వేల మెగావాట్ల విద్యుత్ ను యూనిట్ కు కేవలం రూ. 2.49 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో మొదటి విడత 3 వేల మెగావాట్లు, 2025 లో రెండవ విడత 3 వేల మెగావాట్లు, 2026లో మూడో విడత వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ విద్యుత్ సరఫరా చేస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version