జాతీయ రాజకీయాల్లో BRS కీలకపాత్ర : హరీష్‌రావు

-

జాతీయ రాజకీయాల్లో BRS కీలకపాత్ర ఉంటుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు కీలక ప్రకటన చేశారు. దేశంలో కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

తెలంగాణ నిరుద్యోగ నిర్మూలన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రోజురోజుకు బలహీన పడుతోందన్నారు.

జాతీయస్థాయిలో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ వల్ల దేశానికి, తెలంగాణ కు ఎలాంటి లాభం లేదని విమర్శలు చేశారు. దేశంలో కచ్చితంగా అధికారం మార్చాల్సిన అవసరం ఉందని హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version