తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వేలిముద్ర పడకపోయినా పెన్షన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. పెన్షన్ చాలా మంది వృద్ధులకు వస్తుంది. అయితే వృద్ధుల చేతి ముద్రలు సరిగా ఉండవు. పెన్షన్ వేలిముద్రల మిషన్ లో వారి వేలి ముద్రలు సరిగా తీసుకోదు. దానివల్ల పెన్షన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధ పింఛన్ల పంపిణీ సమయంలో వేలిముద్రలు పడకపోవడం సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు.
మిషన్లు వేలిముద్రలను గుర్తించలేక పింఛన్ ఇవ్వలేకపోతున్నట్లు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… చాలా మంది పెన్షన్ దారులకు ఖాతాల్లోనే డబ్బులు పడుతున్నాయి. కొంత మంది వేలిముద్రలు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అయితే వేలిముద్రల సమయంలో.. ఇబ్బందులు వస్తున్నాయట. అయితే అందుకే వేలిముద్రపడకపోయినా పెన్షన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు పంచాయతీలకు ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు.