57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు అవుతుంది. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తాజాగా నారాయణ పేట్ లో 390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసుకున్నారు. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఇది సాధ్యమైందని..నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ ఇక్కడి నుండి మంత్రులుగా ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఎవరు తెలీదు.
ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే మొత్తం 4 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతున్నదని పేర్కొన్నారు. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ గారు 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. నారాయణ్ పేటలో మెడికల్ కాలేజ్ వస్తుంది. మీ కోరిక మేరకు నారాయణ్ పెట్ లో ఈ విద్యా సంవత్సరంలోనే నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసే టి డయాగ్నొస్టిక్ సెంటర్ ని ప్రారంభించాము. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, టు డి ఏకో సేవలు కూడా ఇక్కడ అందుతాయని తెలిపారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నారు మీకు బాగా తెల్సు. అక్కడ రైతులకు 6 గంటల కరెంట్ ఉందా. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుందని.. బిజెపి పాలన రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు. బిజెపి ఫెయిల్, టిఆర్ ఎస్ పాస్ అయినట్టే కదా ? అని అగ్రహించారు.