బీఆర్ఎస్ నాయకులు మొరుగుడుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.85వేల కోట్లు ఖర్చు చేస్తే.. తాము ఒక్క ఏడాదిలో రూ.53వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం రాష్ట్ర ప్రజలే చెప్పాలని పేర్కొన్నారు.
అదేవిధంగా బడా బాబులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే కొండలు, గుట్టలకు రైతు బంధు వేసి వాళ్లు రూ.20వేల కోట్లు వృధా చేసారని.. ఆరోపించారు. రైతుల కోసం ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోలేకపోతున్నామని తెలిపారు. ఆ మొరుగుడుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్నీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందని చామల పేర్కొన్నారు.