అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు : కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

-

దేశ రాజధాని ఢిల్లీలో అవినీతి, కుంభకోణాలు, వారసత్వ, జైలు పార్టీలకు ఢిల్లీ ప్రజలు చరమగీతం
పాడారని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం జెండా
ఎగరేయడమే లక్ష్యంగా పనిచేసిన అందరినీ ‘ఎక్స్’ వేదికగా ఆయన అభినందించారు. లక్ష్య
సాధనలో అఖండ విజయం సాధించిన విజేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ఢిల్లీలో  భారతీయ జనతా పార్టీ ఘన విజయం ప్రజలకే చెందుతుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు.  ప్రజలంతా నిబద్ధతతో శ్రమించి భాజపాను గెలిపించారని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. సుపరిపాలన, మౌలిక వసతుల కల్పన, కాలుష్య రహిత యమునను ప్రజలంతా ఆశించారని.. పేదలకు ఇళ్లు, శుభ్రమైన తాగునీటి వసతులను కోరుకున్నారని అన్నారు. కులమతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా భాజపాపై తిరుగులేని విశ్వాసం ఉంచారని తెలిపారు. ఢిల్లీ ప్రజలు, బీజేపీ  కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version