ఎంపీ గారి రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం పై స్పందించారు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. మోడీ, బీజేపీ నియంతల పోకడలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు మధుయాష్కి గౌడ్. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధి వ్యక్తిగత సమస్య కాదన్నారు.
ఇది ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాలకు చీకటి రోజులని వ్యాఖ్యానించారు. తెలంగాన ప్రజలు ఈ విషయంలో పోరాటాలు చేయాలని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఉధృతంగా పోరాటం చేస్తుందని.. న్యాయపరంగా, రాజకీయంగా మా పోరాటాలు ఉంటాయని తెలిపారు. రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం అన్నారు మధుయాష్కీ గౌడ్. మా పోరాటాలు, మేము ప్రశ్నించడం ఆగదని స్పష్టం చేశారు.