హైడ్రా పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు : కేటీఆర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్ లో ఎవ్వరి వద్ద డబ్బులు లేవు.  లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. హైడ్రా పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఉన్న ప్రాజెక్టులను రద్దు చేస్తున్నారు.. కొత్తవి వద్దంటున్నారు. హైడ్రా పై కేటీఆర్ విమర్శలు చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. వ్యక్తి గతంగా ఎవ్వరినీ కూడా టార్గెట్ చేయలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా, రేవంత్ రెడ్డి నిర్ణయాలే కారణం అన్నారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నిర్మాణాల గురించి ఎవరినీ కలవాలో తెలియడం లేదు. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే ఇదంతా.. రియల్టర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version