రెండు రోజులుగా నాకు చాలా బెదిరింపులు వచ్చాయి : కస్తూరి

-

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ నటి కస్తూరి మాట్లాడిన మాటలపై చర్చ నడుస్తునా విషయం తెలిసిందే. అయితే తన మాటలను వక్రీకరించారు అని పేర్కొన కస్తూరి.. తనకు గత రెండు రోజులుగా నాకు చాలా బెదిరింపులు వచ్చాయి అని తెలిపింది. అయితే అవి నా సంకల్పాన్ని మరింత పెంచాయి. నేను నిజమైన జాతీయవాదిని. నేను ఎప్పుడూ కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను.

ఇక తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం నా అదృష్టం. తెలుగు వారు నాకు పేరు, కీర్తి, ప్రేమను అందించారు. నేను వ్యక్తీకరించిన అభిప్రాయాలు కోందరిని మాత్రమే.. అందరినీ అనలేదు‌. నా తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. మీ మనసును బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. 3వ తేదినా మాట్లాడిన నా ప్రసంగంలో తెలుగుకు సంబంధించిన అన్ని మాటలను ఉపసంహరించుకుంటున్నాను. ఈ వివాదం నేను ఆ ప్రసంగంలో లేవనెత్తిన ముఖ్యమైన అంశాల నుండి దృష్టిని మళ్లించింది అని కస్తూరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version