ఎత్తు ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్యలు వస్తాయట.. అధ్యయనంలో తేలినదేంటంటే..

-

మనిషి శరీరంలో ఏది ఎక్కువైనా సమస్యే.. బరువు ఎక్కువగా ఉన్న తప్పే.. తక్కువగా ఉన్నా తప్పే. వేటికి ఉండే రోగాలు వాటికి ఉన్నాయి.. బరువు ఎక్కువైతే.. డయబెటీస్‌, అధిక కొలెస్ట్రాల్‌, కీళ్లు అరిగిపోవడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. బరువు సమస్యను అయితే తగ్గించుకునే అవకాశం ఉంది.. మరీ పొడవును ఎలా తగ్గించుకోగలుగుతాం.. ఎక్కువ హైట్‌ ఉంటే కూడా కొన్ని సమస్యలు వస్తాయట..మనిషి ఎత్తును బట్టి వచ్చే రోగాలను కనుక్కునేందుకు ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలో తేలిన కొన్ని విషయాల గురించి ఈరోజు చూద్దాం..!

అమెరికాలోని రాకీ మౌంటెయిన్ రీజినల్ వీఏ మెడికల్ సెంటర్ పరిశోధకులు శరీర ఎత్తుతో ముడిపడిన సమస్యలు కనుక్కునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. వారు జన్యు విశ్లేషణపై దృష్టి పెట్టారు. శరీర ఎత్తు వారి ఆరోగ్యాన్ని ఎలా నిర్ణయిస్తుందనే దానిపై వీళ్లు అధ్యయనం చేశారు. ఇప్పటి వరకు చేసిన అధ్యయనంలో పొడవు ఎక్కువగా ఉన్నవారిలో గుండెలయ తప్పటం, కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు అధికంగా వస్తున్నట్టు వాళ్లు గుర్తించారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పొడవు ఎక్కువగా ఉన్నవారికి వచ్చే అవకాశం తక్కువ. ఈ విషయంలో వీరు లక్కీ అనే చెప్పాలి.. అయితే వీళ్లకు అధికంగా వచ్చే సమస్యలు ఏవంటే…

ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ..

ఇక వీరికి అధికంగా వచ్చే సమస్యలు నాడీ సమస్యలు. కాళ్లు, చేతుల్లో నాడులు దెబ్బతినే అవకాశం ఎక్కువని చెబుతున్నారు పరిశోధకులు.
కాళ్లు, పాదాల మీద పుండ్లు పడడం, చర్మ, ఎముకల ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉన్నట్టు తెలిపారు.
ఎత్తుగా ఉండే వారి జన్యువుల్లోనే ఈ సమస్యల తాలూకు మూలాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

గతంలో చేసిన అధ్యయనాల్లో ఎత్తుగా ఎక్కువగా ఉన్నవారికి వందకు పైగా రోగాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. అయిదు అడుగుల తొమ్మిది అంగుళాలు దాటిన వారందరిని ఎత్తయిన వారిగా గుర్తిస్తారు. అందుకే అధ్యయనంలో భాగంగా అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్నవారినే తీసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా స్త్రీలలో అయిదు అడుగుల మూడు అంగుళాల కన్నా ఎత్తు ఎక్కువగా ఉంటే వారంతా పొడవైన మహిళల కిందకే వస్తారు. వారిలో ఆస్తమా రోగం త్వరగా వస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. సో అది మ్యాటర్..

Read more RELATED
Recommended to you

Exit mobile version