తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం.. ఓపిగ్గా ఫాలో అయితే రిజల్ట్‌ పక్కా..!!

-

లైఫ్‌స్టైల్‌ ఛేంజెస్‌ వల్ల ఈరోజుల్లో తక్కువ వయసున్న వారికే.. తెల్లజుట్టు ఎక్కువగా వస్తుంది. స్కూల్‌ పిల్లలకు కూడా తెల్లజుట్టు వస్తే..పాపం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఆ వయసునుంచే..రంగులు వాడటం మొదలేస్తే..ఇంకేమైనా ఉందా.. 20 దాటేసరికి జుట్టు అంతా ఊడిపోయి చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్కెట్‌లో ఐదునిమిషాల్లో జుట్టును నల్లగా మార్చే కలర్స్‌ చాలా ఉన్నాయి.. వీటి వల్ల నిజంగానే జుట్టు నల్లగా అవుతుంది. కానీ రెండు మూడు రోజులే.. తర్వాత మళ్లీ మామూలే..పైగా ఉన్నది ఊడటం మొదలవుతుంది. నాలుగు తెల్ల వెంట్రుకలు కాస్తా..నలభై అవుతాయి.. తెల్లజుట్టును వదిలించుకోవడాని శాశ్వత పరిష్కారం వైపు దృష్టిపెట్టడం మంచిది. వీటి వల్ల రిజల్ట్‌ లేటుగా వచ్చినా సమస్య పునరావృతం కాదు.. అలాంటి నాచురల్‌ పద్దతుల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒకటి..

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి స్పూన్ టీ పొడి, రెండు బిర్యానీ ఆకులు, ఒక వెల్లుల్లిపాయ వేసి బాగా మరిగించండి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్‌లోని పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడగట్టి దీనిలో కొంచెం కొబ్బరి నూనె కలపాలి. ఈ నీటిని జుట్టుకు బాగా పట్టించాలి. తలస్నానం చేసి అరిన జుట్టుకు మాత్రమే దీన్ని పట్టించాలి. అరగంటయ్యాక నార్మల్‌ వాటర్‌తో తల స్నానం చేయండి. షాంపూ వాడొద్దు…మరుసటి రోజు తలకు షాంపూ పెట్టండి… ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య కూడా పోతుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ నీటిని రెండువారాలకు సరిపడా చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోని వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version