జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పుడున్న ప్రభుత్వం మారాలన్న పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు, ఎవరి కోసం మారాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చారని వ్యంగ్యంగా విమర్శించారు. ప్రజల కోసం అన్ని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ కు మళ్ళీ సినిమాలు ఏమిటని ప్రశ్నించారు. గత సంవత్సరం ప్రజలకు పవన్ ఏం మేలు చేశారో చెప్పాలన్నారు.
చంద్రబాబు బాగుండాలనేదే పవన్ అంతిమ లక్ష్యం అన్నారు పేర్ని నాని. ఎవరిని మోసం చేద్దామని ఈ దగా మాటలు అని ఫైర్ అయ్యారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నాడని విమర్శించారు. కాపులు ఓటేస్తే ఓడిపోయే వాడిని కాదని పవన్ అన్నారని.. ఒక నాయకుడు అనాల్సిన మాటలేనా అవి అంటూ విమర్శించారు. ఒక కులం ఓట్లతోనే ముఖ్యమంత్రి అవుతారా? అని ప్రశ్నించారు పేర్ని నాని. మరో ఏడాదిలో రంగులు బయటపడతాయని జోష్యం చెప్పారు.