పేర్ని నాని గోడౌన్ దగ్గర నుంచి వెనుతిరిగిన అధికారులు..!

-

పేర్ని నాని గోడౌన్ దగ్గర నుంచి అధికారులు వెనుతిరిగారు. పొట్లపాలెంలో గ్రామంలో ఉన్న పేర్ని నానికి చెందిన గోడౌన్ ను పరిశీలించారు మైన్స్ అధికారులు.. గోడౌన్ నిర్మాణ సమయంలో ఎటువంటి సీనరేజీ చెల్లించకుండా బుసక తోలి మెరక చేశారని మైనింగ్ అధికారులకు ఫిర్యాదు అందింది. సర్వే నెంబర్ 89/2, 92/1లలో 60వేల క్యూబిక్ మీటర్ల బుసకను గోడౌన్ స్థలం మెరకకు వినియోగించారని ఫిర్యాదు చేసారు.

అయితే ఇటీవల గోడౌన్ లో 7557 బస్తాల రేషన్ బియ్యం మాయంపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఎ1గా పేర్ని జయసుధ, ఎ6గా ఉన్న పేర్ని నాని ఉన్నారు. ఓ పక్క రేషన్ బియ్యం మాయంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గోడౌన్ నిర్మాణంలోనూ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ భూముల్లో మట్టి, బుసకను పెద్ద ఎత్తున తవ్వి గోడౌన్ నిర్మాణానికి వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోడౌన్ ని పరిశీలించేందుకు వచ్చిన మైనింగ్ ఎజీ కొండారెడ్డి.. గోడౌన్ కు తాళాలు వేసి ఉండటంతో బయటే ఉండి ఉన్నతాధికారులకు విషయం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version