ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్ గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్ లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డాక్టర్ దువ్వాడ దీపక్ ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలియజేశారు.
కచ్చితంగా చట్ట ప్రకారం.. చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థినులు, యువతుల రక్షణకు రాస్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీస్ శాఖ కూడా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో పాటు బాధిత వర్గం ఆవేదనను భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థులు ఆందోళనకు లోనవుతారు.