ఏపీలో పదవతరగతి పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితుడి అరెస్ట్..!

-

పదవతరగతి ఎస్.ఎ. 1 పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషనల్ రీసర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు అరుణ్ కుమార్. ఈ నెల 16న తేదిన పదవతరగతి గణితం ఎస్.ఎ.-1 పరీక్ష పేపర్ ముందు రోజు సాయంత్ర సమయంలో కొన్ని అనధికార యూటుబ్ ఛానెల్స్ లో పోస్ట్ చేయటంపై ఫిర్యాదు చేసారు.

ఇక విచారణలో భాగంగా యూటుబ్ లో గణితం ఎస్.ఎ.-1 పరీక్ష పేపర్ ను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక బాలుడు పోస్ట్ చేసినట్టు గుర్తించారు. బాలుడి విచారణలో.. విజయవాడకు చెందిన మరో బాలుడి టెలిగ్రాం ఛానల్ నుండి పొందినట్లు తెలిపాడు. అయితే ఆ టెలిగ్రాంఛానల్ వివరాలను సేకరించి దర్యాప్తు చేయగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రామచంద్రపురానికి చెందిన తీపర్తి వీర వెంకట సుబ్బారావు పేపర్ లీక్ చేయడానికి కారణమని గుర్తించారు. సదరు వ్యక్తి, ప్రతి పరీక్షకు రామచంద్రాపురం లోని ఎం.ఈ.ఓ. ఆఫీస్ నుండి స్కూల్ కి ప్రశ్నా పత్రాలను తీసుకురావడానికి వారి స్కూల్ తరఫున వెళుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. తన స్కూల్ నందు చదువుతున్న పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చి స్కూల్ ఇమేజ్ పెంచాలని.. ఉద్దేశపూర్వకంగా రామచంద్రాపురం ఎం.ఈ.ఓ. శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడి ఇలా చేసినట్టు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version