రింగ్ రోడ్డు మాదిరి ఖమ్మంలో ఒక్క రోడ్ నిర్మించబోతున్నం : తుమ్మల నాగేశ్వరరావు

-

ఖమ్మంపట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయనున్నాం.. అలాగే ఖమ్మం మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాం అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నాం. ఖమ్మం కు ఒక్క రింగ్ రోడ్డు మాదిరిగా జాతీయ రహదారుల మీదుగా చేస్తున్నాం. గంటలో రాజమండ్రి కి చేర్ విధంగా చేస్తున్నాం. హైదరాబాద్ ORR మాదిరిగా ఒక్క రోడ్ నిర్మాణం వస్తుంది.

గోదావరి జలాలు పది నియోజకవర్గాలకు రావడం నా కోరిక దానిని పూర్తి చేయడమే లక్ష్యం. సీత రామ ప్రాజెక్టు.. మళ్ళీ వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి యాతల కుంట టన్నెల్ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. జగ్గయ్య పేట నుంచి వైరా మీదుగా నేషనల్ హైవే నిర్మాణం చేస్తాం. కొత్తగూడెం నుంచి కౌతల రోడ్ నిర్మాణం చేస్తే భద్రాచలం కనెక్టివిటీ పెరుగుతుంది. 3000 కోట్లతో సీతమ్మ సాగర్ పూర్తి అయితే…. పోలవరం నుంచి కాళేశ్వరం వరకు గోదావరి లో వాటర్ వేస్ ను చేయాలన్న కోరిక వుంది. పాండురంగ పురం భద్రాచలం వరకు రైల్వే లైన్ నిర్మాణం పై కేంద్రాన్ని అడుగుతున్నాం. ఎయిర్ వేస్ కొత్తగూడెంకు అవకాశం వుంది అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version