ఏడు లక్షలతో పెంపుడు కుక్కకు బర్త్ డే పార్టీ… ఆ తరువాత అరెస్ట్ చేసిన పోలీసులు

-

చాలా మంది వారి పెట్స్ ను ఎంతో ప్రేమ కనబరుస్తుంటారు. ముఖ్యంగా పెంపుడు శునకాలకు అక్కడక్కడ పుట్టిన రోజు వేడుకలు చేయడం, వాటికి శ్రీమంతాలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాగే గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన చిరాగ్ పటేల్, ఊర్విష్​ పటేల్​ అనే సోదరులు ఏకంగా తన పెంపుడు కుక్క ‘ అబ్బీ’కి అక్షరాల రూ. 7 లక్షలతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విందు, వినోదాలు, డ్యాన్స్ లతో వేడకను సెలబ్రేట్ చేసుకున్నారు.

సీన్ కట్ చేస్తే చిరాగ్ పటేల్, ఊర్విష్ పటేల్ లతో పాటు అతని స్నేహితుడు దివ్యేష్ మోహారియాలను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రాండ్ గా పార్టీ చేశారు కానీ.. పార్టీకి వచ్చిన వారు కోవిడ్ నిబంధనలను పాటించలేదు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేదు. భౌతిక దూరాన్ని అసలే పాటించలేదు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై ద్రుష్టి సారించారు. పార్టీకి కారణమైన వారిని కోవిడ్ నిబంధనలు ఉల్లఘించడంతో పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version