జిమ్‌లో వ‌ర్కవుట్ సెష‌న్‌లో ఓ మ‌హిళ‌తో క‌లిసి పాల్గొన్న శున‌కం… వీడియో వైరల్

-

ఈ ప్రపంచం లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం ఉన్న జంతువూ ఏది అంటే, సందేహం లేకుండా, ఏ మాత్రం తడబడకుండా కుక్క అని చెప్పేస్తారు. మ‌నుషుల ప‌ట్ల కుక్క‌లకు ఎంతో విశ్వాసం ఉంటుంద‌ని చెబుతుంటారు. మనుషుల పట్ల, ప్రత్యేకంగా వాటిని పెంచే వారి దగ్గర మాత్రం అపారమైన ప్రేమను కనుపరుస్తుంటాయి శునకాలు. కుక్క‌లు మ‌నుషులతో స్నేహంగా మెలుగుతుంటాయి. త‌మ య‌జ‌మానుల‌కు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో అన్నీ తామై శున‌కాలు చూసుకుంటాయి. అంతే కాకుండా చాలాసార్లు కొంటె పనులు చేస్తూ తమ చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తూ ఉంటాయి.

కుక్కలు ఇలా చేసే పనులేవీ ఎన్నో వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గ కూడా మారుతాయి. ఇక మ‌నిషితో పెంపుడు కుక్క బంధానికి అద్దం ప‌ట్టేలా ఇలాంటి ఒక క్యూట్ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతుంది. ఇన్‌స్టాగ్రాంలో వైర‌ల్‌హాగ్ వారు షేర్ చేసిన ఈ వీడియోలో ట్రెడ్‌మిల్‌పై ఓ మ‌హిళ న‌డుస్తుండ‌గా వ‌ర్క‌వుట్ సంద‌ర్భంగా ఆమె వెంట కుక్క కూడా క‌నిపిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version