వాలంటీర్లను విధుల్లోంచి వెంటనే తొలగించాలని హైకోర్టులో పిటిషన్

-

ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు విధుల్లోంచి వాలంటీర్లను వెంటనే తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

కాగా, వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెలలో పెన్షన్లను వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో తమను విధుల్లోంచే తొలగిస్తారనే భయము నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version