గత ఏడాదిన్నర కాలంగా టీ20 నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఐసీసీ ప్రకటించిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అతను రెండో స్థానానికి పడిపోయాడు.
భారత్‌పై అర్ధశతకం బాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.ఐసీసీ ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. 844 రేటింగ్ పాయింట్లతో హెడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 842 రేటింగ్ పాయింట్లతో సూర్య సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 2 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది.
హెడ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 7 మ్యాచ్‌ల్లో 255 పరుగులు చేశాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ మొదట్లో సత్తా చాటకపోయినా, ఆ తర్వాత ఫామ్ అనుకున్నాడు. ఇప్పటివరకూ 6 ఇన్నింగ్స్‌లలో 149 పరుగులు చేశాడు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ టాప్ 5 బ్యాట్స్ మెన్
* ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా): 844 పాయింట్లు
* సూర్యకుమార్ యాదవ్(ఇండియా): 842 పాయింట్లు
* ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్): 816 పాయింట్లు
* బాబర్ ఆజం(పాకిస్తాన్): 755 పాయింట్లు
* మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్): 746 పాయింట్లు