షాకింగ్ : మళ్ళీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు..!

-

దేశ వ్యాప్తంగా కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే సడలింపులతో బయటకి రావడం మొదలుపెట్టారు. ప్రజలు ఆర్థికంగా కొలుకోడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఇలాంటి పరిస్థితులలో సామాన్యుడి నెత్తిపై మరో భారం మోపనుంది ప్రభుత్వం. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు మరో సారి పెరిగాయి. ఈ ఉదయం 6 గంటలకు పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. పెట్రోలు ధర 48 నుంచి 62 పైసల మేరకు పెరుగగా, డీజిల్ ధర 53 నుంచి 64 పైసల వరకూ పెరిగింది. మారిన ధరలను బట్టి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ. 75.78, చెన్నైలో రూ. 79.53, ముంబయిలో రూ. 82.70కి పెరుగగా, ఇవే నగరాల్లో డీజిల్ ధర వరుసగా రూ. 74.03, రూ. 72.18, రూ. 72.64కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర రూ. 78.67కు, విశాఖపట్నంలో రూ. 77.47కు చేరుకోగా, లీటరు డీజిల్ ధర విశాఖపట్నంలో రూ. 71.25కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version