మళ్లీ పెరిగిన ధరలు
పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోలుపై 16 పైసలు, డీజిల్ పై 19 పైసలు చొప్పున పెరిగింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రలోలు, డీజిల్ ధరలు సామాన్యుని నడ్డివిరుస్తున్నాయి…
ప్రధాన నగరాలు |
పెట్రోలు/ లీటర్ |
డీజిల్/లీటర్ |
హైదరాబాద్ |
రూ.84.09 | రూ. 77.60 |
ఢిల్లీ |
రూ. 79.31 | రూ.71.34 |
ముంబయి |
రూ. 86.72 |
రూ. 75.54 |
విజయవాడ | రూ.85.59 |
రూ. 78.76 |
చెన్నై | రూ.82.41 |
రూ. 75.39 |
అంతర్జాతీయంగా చముదు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై అత్యధికంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండటంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. వీటికి తోడు రోజురోజుకి రూపాయి విలువ బలహీన పడటంతో ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ఇలాంటి ఫలితాలు తప్పవని నిపుణుల అభిప్రాయం.