ప్రగతి నివేదన సభ, శ్రీ కృష్ణాష్టమి పండుగ కారణంగా మూడు రోజుల పాటు వాయిదా పడ్డ కంటివెలుగు వైద్యశిబిరాలు మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగనున్నాయని వైద్యాధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు . ఆగస్టు 15 న ప్రారంభమైన కంటివెలుగు ద్వారా ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నరలక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాటరాక్ట్, గ్లకోమాతో పాటు ఇతర సమస్యలున్న వారికి గాంధీ, సరోజిని, ఉస్మానియ ఆస్పత్రిలతో పాటు పలు ప్రైవేటు దవాఖానాల్లో శస్త్రచికిత్సలు చేస్తున్నారు.