విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సటీలో 13 మంది విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడంతో సీనియర్, జూనియర్ల ల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తమను వేధిస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏయూ… 13 మంది సీనియర్లపై వేటు వేసింది. వారిని సెమిస్టర్ కాలం హాస్టల్ నుంచి సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.