హైదరాబాద్‌లో పెట్రోల్ రేట్ ఎంతో తెలుసా?

-

న్యూఢిల్లీ: దేశంలో పెట్రల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 10 రోజులుగా ధరలు మరింతగా పెరిగాయి. పలుప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటగా మరికొన్ని చోట్ల రూ. 100కు చేరువలో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం 28 పైసలు పెరిగింది. సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 98.20గా ఉండగా మంగళవారం 28 పైసలు పెరిగి రూ. 98.48పైసలకు చేరింది.

ఇక డీజిల్ విషయానికి వస్తే మంగళవారం 30 పైసలు తగ్గింది. ఈ రోజు హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.93.38గా ఉంది. సోమవారం డీజిల్ రేటు.. రూ. 93.08గా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురుకు ఏర్పడిన డిమాండ్ వల్లే ధరలు పెరుగుతున్నాయని, ధరల నియంత్రణ కష్టమేనని కేంద్ర పెట్రోల్ శాఖ ప్రకటించింది.

పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్స్:
న్యూఢిల్లీ: డీజిల్ రూ.85.66, పెట్రోల్ రూ. 94.76
కోల్ కత: డీజిల్ రూ.88.51, పెట్రోల్ రూ. 94.76
ముంబై: డీజిల్ రూ. 92.99, పెట్రోల్ రూ. 100.98
చెన్నై: డీజిల్ రూ.90.38, పెట్రోల్ రూ.96.23
బెంగళూరు: డీజిల్ రూ. 90.81, పెట్రోల్ రూ. 98.55
భువనేశ్వర్: డిజిల్ రూ. 93.34, పెట్రోల్ రూ. 95.49

ఇక పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణపై కేంద్రం చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ భారం నిత్యావసరాలపై పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో ధరల భారాన్ని భరించలేకపోతున్నామని వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version