ఇవాళ ‘మృగశిర కార్తె’. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని ప్రజలు భావిస్తారు. అందుకే ఈ రోజు చేపలు తింటారు. 27 నక్షత్రాల్లోకి ఈ రోజు సూర్యుడి ప్రవేశం జరుగుతుంది. ఇలా జరగడాన్ని ‘మృగశిర కార్తె’గా పిలుచుకుంటారు. అంతేకాదు ఈ కార్తె ప్రారంభంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. నిన్నటితో రోహిణీ కార్తె ముగిసింది. ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభంకావడంతో తొలకరి వర్షాలు కురుస్తాయి. దీంతో రైతులు ఏరువాక లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగళ్లతో పొలాలను దున్ని పంటలు వేస్తారు.
ఈ కార్తె సందర్భంగా చేపలు తినడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వేసవి కాలం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. వేడిగా ఉండే చేపలను తింటారు. ఇలా చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, అస్తమా వంటి రోగాలు నయం అవుతాయని నమ్మకం. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలు కూడా తగ్గుతాయని అంటారు. అందుకే మృగశిర కార్తె రాగానే ప్రజలందరూ చేపలు తినేందుకు మరింత ఆసక్తి చూపుతారు.