ఫోన్ ట్యాపింగ్ కెసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య – బండి సంజయ్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఫోన్ టాపింగ్ కు పాల్పడుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ లు కొనుగోలు చేశారని అన్నారు. లిక్కర్ కుంభకోణంలో తన బిడ్డపై వచ్చిన ఆరోపణలపై కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

చికోటి ప్రవీణ్ క్యాసినో కుంభకోణంపై కూడా స్పందించలేదన్నారు. కెసిఆర్ మౌనంగా ఉన్నారంటే స్కామ్ ను ఒప్పుకున్నట్లేనని అన్నారు. మునుగోడు ఉపఎన్నికతో తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉందని అన్నారు. మునుగోడులో ఒక్కొక్కరికి 40 వేలు పంచడానికి టిఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు. నియోజకవర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని.. కాంగ్రెస్ వాళ్లు గెలిచినా మళ్ళీ టిఆర్ఎస్ లోకే వెళతారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఏం చేసినా గెలుపు బిజెపి దేనని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version