తయారైన కృష్ణ విగ్రహం ఫొటోస్ వైరల్..!!

-

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ మరణం ఇప్పటికి అభిమానులను, సినీ ప్రేక్షకులు సైతం.. కృష్ణ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహేష్ కుటుంబంలో తన తల్లిదండ్రులతో పాటు తన అన్నయ్య కూడా మరణించడంతో మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూనే ఉన్నారు. వరుసగా మూడు దెబ్బలు ఒకేసారి పడడంతో మహేష్ బాబు తీవ్రంగా కుంగిపోతున్నారు. మహేష్ బాబుకు మనోధైర్యం కల్పించాలని అభిమానుల సైతం దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. తర్వాత మహేష్ బాబు చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇక నవంబర్ 27వ తేదీన హైదరాబాదులో కృష్ణ దశదినకర్మ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సినీ సెలెబ్రెటీలతోపాటు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కృష్ణ దశదినకర్మ కోసం ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోని కృష్ణ 27 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పోలికలతో అచ్చం జీవకల ఉట్టిపడేలా ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ శిల్ప రాజ్ కుమార్ వడయార్.. ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేటలో కృష్ణ విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది.

కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయన కేవలం రెండు రోజులలోనే ఈ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేశారు. ఇకపోతే ఎంతోమంది అభిమానులను సంపాదించిన కృష్ణ విగ్రహాన్ని పలు నగరాలలో కూడా ఏర్పాటు చేసే విధంగా పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణ నటించిన పలు చిత్రాలలోని పాత్రలలో విగ్రహాలను ఆర్డర్ వస్తున్నట్లు సమాచారం. కృష్ణాజిల్లాలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణకు సంబంధించి ఈ విగ్రహ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version