అవతార్ మేనియా… 3 రోజుల్లో 15 వేలకు పైగా…

-

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అవతార్ 2. కనీవినీ ఎరుగని రీతిలో ఫస్ట్ పార్ట్ ట్రెమండస్ హిట్ కొట్టడంతో సీక్వెల్ కోసం పుష్కర కాలంగా జనం వెయిట్ చేస్తున్నారు. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’గా డిసెంబరు 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ‘అవతార్‌2’ రికార్డులు తిరగరాస్తోంది. ‘అవతార్’ సీక్వెల్ ప్రీమియం ఫార్మాట్‌లలో 45 స్క్రీన్‌లలో అడ్వాన్స్ ఓపెనింగ్స్ మొదలవగా, 3 రోజుల్లోనే 15,000 టిక్కెట్‌లు విక్రయమయ్యాయి.

 

ఈ సందర్భంగా పీవీఆర్‌ పిక్చర్‌ సీఈవో జియా చందానీ మాట్లాడుతూ.. “జేమ్స్ కామెరూన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. భారతదేశంలోనూ ఆయన మూవీలను చూసే వారు ఎక్కువ. అందుకే ‘అవతార్2′ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌పై భారీ స్పందన వస్తోంది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్‌లకు మాత్రమే. సాధారణ బుకింగ్స్‌ మొదలైతే అత్యధిక సంఖ్యలో టికెట్‌ బుకింగ్స్‌ జరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. ఐనాక్స్‌ చీఫ్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ రాజేందర్ సింగ్ జ్యాలా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ”13ఏళ్ల క్రితం విడుదలైన అవతార్‌ చిత్రానికి వచ్చిన భారీ స్పందన చూసి అందరం ఆశ్చర్యపోయాం. దానికి మించిన స్పందన ‘అవతార్2’కు వస్తోంది. సినిమాను సినీపోలిస్‌ రియల్‌ 3డీలో ప్రేక్షకులకు అందిస్తున్నాం” అని సినీపోలీస్ సీఈఓ దేవాంగ్ సంపత్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version