కరోనా గురించి చైనా పందులను కాల్చేస్తుంది…! నిజమేనా…?

-

సోషల్ మీడియాలో ఏదైనా చిన్న వీడియో వస్తే చాలు అది ఏ స్థాయిలో వైరల్ అవుతుందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని జనం ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు. ఇక ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

చైనా కరోనా వైరస్ ని అరికట్టేందుకు గాను చైనా పందులను కాల్చి చంపేస్తుందని, సజీవ దహనం చేస్తుందని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది నిజం కాదని తెలిసింది. ఫేస్‌బుక్‌లో చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు, వ్యాధులను నియంత్రించడానికి పందులను చైనా ప్రభుత్వం సజీవ దహనం చేస్తుందని వీడియోకి సంబంధించి కొన్ని పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.

ఈ వైరల్ వీడియో సుమారు ఒక సంవత్సరం పాతదని కనుగొంది. చైనాలో కరోనావైరస్ వ్యాప్తికి చాన్నాళ్ళ ముందే ఇది బయటకు వచ్చింది. 85 సెకన్ల వీడియో ఫేస్‌బుక్‌లో చాలా వైరల్‌ అయింది. పందులను సజీవంగా కాల్చడం మరియు పాతిపెట్టడం అనే శీర్షికతో 2019 జనవరి 11 న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. 2018 లో ఆఫ్రికన్ స్వైన్ జ్వరం వ్యాప్తిని నియంత్రించడానికి చైనా వేలాది పందులను సజీవ దహనం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version