ప్రకృతి నుంచి వచ్చే పండ్లలో ప్రతీది ఆరోగ్యంగా ఉంచుతుంది. అందులో పైనాపిల్ ప్రత్యేకం. ఇది పుల్లగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మరిన్ని ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పైనాపిల్‌లో ఎన్నో ప్రత్యేక గుణాలున్నాయి. పుల్లపుల్లగా తీయతీయగా ఉండే వీటిలో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫ్యాట్‌కు సంబంధించిన కొలెస్ట్రాల్ ఏమీ ఉండదు. విటమిన్ ఏ,బి,సీ పొటాషియం, మాంగనీస్, కాపర్ ఉంటాయి.
2. ఈ రోజుల్లో ఎక్కువమందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కప్పు ఫైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్లే. దీనితో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. పైనాపిల్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
3. పైనాపిల్లో కణజాలం వృద్ధి చెందడానికి కణాల మరమ్మత్తుకు అవసరమయ్యే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం రాకుండా క్యాన్సర్, గుండెజబ్బులు దరిచేరకుండా చూస్తాయి.
4. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా పైనాపిల్ ఉపయోగపడుతుంది. సంతానం కోరుకునే జంట రెగులర్‌గా పైనాపిల్స్ తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది.
5. విటమిన్ సీ, బీటా కెరోటిన్, కాపర్, మినరల్స్ సంతానోత్పత్తికి తోడ్పడతాయి. పైనాపిల్ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు బాగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆహారం ఎక్కువగా తీసుకోకుండా చూస్తుంది. అలాగే మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది. సైనస్, అలరీజలతో బాధపడే వాళ్లకు పైనాపిల్ చక్కటి పరిష్కారం.
6. ఇందులో ఉండే పోషకాలు గొంతు, ముక్కులో ఉండే శ్లేష్మంను అరికడుతుంది. ఒకవేళ సీజనల్ అలర్జీలు ఉంటే పైనాపిల్స్‌ని డైట్లో చేర్చుకోవచ్చు. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. కాబట్టి ఎప్పుడైనా జలుబు, దగ్గు వచ్చాయంటే ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగితే వెంటనే రిలాక్స్ అయిపోతారు.
7. మొటిమలతో బాధపడుతున్నప్పుడు పైనాపిల్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్స్‌తోపాటు ఎంజైమ్స్ ఉండడం వల్ల జ్యూస్‌ఆగా తీసుకున్నా మంచిదే. ఫేస్‌ప్యాక్‌లా వేసుకున్నా మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా పసుపు తీసుకొని పైనాపిల్ పేస్ట్‌లో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.