ధాన్యం కొనుగోలుపై.. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు : పీయూష్ గోయ‌ల్‌

-

ధాన్యం కొనుగోలు పై లోక్ సభలో.. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రస్తావించారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని నిప్పులు చెరిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ సభలోకి వచ్చి డ్రామా చేసిందని మండిపడ్డారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కౌంట‌ర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశం చర్చకు సంబంధంలేని పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు.

వరి ధాన్యాన్ని అనాల్సింది రాష్ట్ర ప్రభుత్వ మేనని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పీయూష్ గోయల్. ఎఫ్ సి ఐ బియ్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు. దాన్యం కొనుగోలు రాష్ట్రప్రభుత్వం చేస్తుందని.. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. బాయిల్డ్ రైస్ సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు పీయూష్ గోయల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version