అసలే ఓ వైపు పాకిస్తాన్ మీద భారత్ దాడులకు పాల్పడటంతో దాయాది దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలి పోతున్నది. ఎప్పుడెప్పుడు భారత్ మీద ప్రతీకారం తీర్చుకుందామా? అని ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలోనే భారత్ ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తర భారతంలో 27 ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు.
ఇదిలాఉండగా, నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంపైన గురువారం ఉదయం విమానం చక్కర్లు కొట్టడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఘటనపై టీటీడీ భద్రతాధికారులు సైతం ఆరా తీస్తున్నారు.ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో తిరుమలలో హైఅలర్ట్ కొనసాగుతోంది.
తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు
తిరుమల శ్రీవారి ఆలయంపై గురువారం ఉదయం విమానం చక్కర్లు కొట్టడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఘటనపై టీటీడీ భద్రతాధికారులు ఆరా తీస్తున్నారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో తిరుమలలో హైఅలర్ట్ కొనసాగుతోంది. pic.twitter.com/I6EeBUPV82
— ChotaNews App (@ChotaNewsApp) May 8, 2025