పాక్ కుట్రలు పన్నుతోంది. భారత్‌లోని అమృత్‌సర్‌పై మిస్సైల్ దాడికి ప్రయత్నించింది పాకిస్థాన్. దానిని భారత్ ఆర్మీ మిస్సైల్‌ని గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేసింది. దీంతో అమృత్‌సర్ పరిసరాల్లో మిస్సైల్ శకలాలు పడిపోయాయి. కాగా.. యాంటీ మిస్సైల్ వ్యవస్థతో భారత్.. పాక్ దాడులను అడ్డుకుంది.

కాగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులపై చర్చ జరుగనుంది. పాక్ – ఇండియా మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మోడీ.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఇక అటు పూంచ్ సెక్టార్‌లో హృదయ విదారక దృశ్యాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పూంచ్ సెక్టార్‌లో నిన్న ఉదయం నుండి భారీ ఎత్తున కాల్పులు జరుపుతున్నాయి పాక్ ఆర్మీ. పాక్ ఆర్మీ కాల్పుల్లో నలుగురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు.