వీళ్ళు పడే కష్టం చూసి కూడా మీరు ఇంట్లోంచి బయటకి వద్దాము అనుకుంటే .. మీరు విలన్ లే !

-

కరోనా వైరస్ వల్ల చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు.  ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ వైరస్ దాదాపు భూమి మీద ఉన్న అన్ని ఖండాల్లో వ్యాపించి ఉంది. ప్రస్తుతం ఈ భూమి మీద మూడు లక్షల మందికి ఈ వైరస్ ఉందని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 11 వేల మంది మరణించడం జరిగింది. చాలావరకు వైద్య సదుపాయం మరియు పరికరాలు లేకపోవటంతో మరణాలు ఎక్కువగా సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా దేశంలో కారణం వైద్య సిబ్బంది కొరత వల్ల పైగా కరోనా వైరస్ కి మందు లేకపోవటంతో అన్ని వేల మరణాలు చోటుచేసుకున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ అరికట్టాలంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని అంటున్నారు. ముఖ్యంగా ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా తిరిగితే మాత్రం ఎక్కువగా పక్కవారిని మాత్రమే కాకుండా వైద్యులను వాళ్లు పడే కష్టానికి మనం మరింతగా భారంగా మారతారని చాలా మంది చెబుతున్నారు.

 

ప్రస్తుతం భూమి మీద ఎక్కువగా కష్టపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైద్యులని…కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్లు పడే కష్టం చూసి ఇంట్లో నుండి బయటకు రాకూడదని…అలా కాదని మూర్ఖంగా బయటకు వస్తే మీరు విలన్ లే అంటున్నారు చాలామంది. ఇన్నాళ్లు మనుషుల్లో మృగాలను చూస్తున్న వారికి ఇప్పుడు దేవుళ్లు దేవతలు కూడా కనిపిస్తున్నారు.. ఇక ఇప్పుడు ప్రపంచ విజేతలు ఎవరంటే వైద్య సిబ్బందని ఒప్పుకోక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version