పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి కాల‌జ్ఞానం ప్ర‌కారం.. భ‌విష్య‌త్తులో ఏర్ప‌డే ఉత్పాతాలు ఇవే..!

-

ప్ర‌పంచ దేశాల‌ను ప్ర‌స్తుతం వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ గురించి పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పార‌ని, ఈశాన్య దిక్కున పుట్టే కోరంకి అనే జ‌బ్బు వ‌ల్ల ల‌క్ష‌లాది మంది చ‌నిపోతార‌ని.. ఆయ‌న అన్నార‌ని.. దానిక‌నుగుణంగానే ఇప్పుడు క‌రోనా వైర‌స్ చైనాలో పుట్టి భారత‌దేశంలోని ప్ర‌జ‌ల‌కు వ్యాపిస్తుంద‌ని.. సోష‌ల్ మీడియాలో వార్త‌లు జోరుగా ప్ర‌చార‌మ‌వుతున్నాయి. ఇక ఆయ‌న గ‌తంలో కాల‌జ్ఞానంలో చెప్పిన‌వ‌న్నీ ఇప్ప‌టికే జ‌రిగిన నేప‌థ్యంలో ఇంకా ఆయ‌న అందులో ఏం చెప్పారు..? భ‌విష్య‌త్తులో ఏమేం ఉప‌ద్ర‌వాలు జ‌ర‌గ‌నున్నాయి..? అని తెలుసుకునేందుకు జ‌నాలు ఆస‌క్తిని చూపిస్తున్నారు. మ‌రి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి మ‌న భ‌విష్య‌త్ గురించి చెప్పిన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

* ప్రపంచంలో పాపుల సంఖ్య పెరుగుతుంది. పుణ్యం చేసిన వారు చ‌నిపోతారు.

* శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది భ్రమరాంబ ఆల‌యంలో 8 రోజులుండి మేకలా కూసి త‌ర్వాత మాయమ‌వుతుంది.

* శ్రీశైలంలో అగ్ని వర్షం ప‌డుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు) రంకెలు వేస్తాడు. ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.

* కృష్ణా, గోదావరి మధ్య పశువులు మరణిస్తాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.

* విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.

* రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.

* సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.

* గ్రామాలు, పట్టణాలలో ర‌క్త వ‌ర్షం కురుస్తుంది. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.

* విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. ఆ త‌రువాత‌ దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి.

* ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వార్‌లోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.

* అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మ‌లు పుట్టి జాజిపూలు పూస్తాయి.

* వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి.

* అరణ్యంలో భూమిలో ధనం ఉంటుంది. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.

* నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరుపతులు నాశ‌న‌మ‌వుతాయి.

* నాలుగు దిక్కులలో దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.

* అమావాస్య రోజున పున్నమి చంద్రుడు క‌నిపిస్తాడు. ఆ చంద్రున్ని చూసిన జనాలు నశిస్తారు.

* తూర్పున శిరస్సు, పడమర తోకగా 20 బార‌ల పొడ‌వుండే ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. అది పుట్టిన 30 రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది. ఆ త‌రువాత‌ ఆకాశం ఎర్రగా మారుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి.

* బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మాహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది. కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.

* పట్ట పగలు ఆకాశం నుంచి పిడుగుల వాన ప‌డుతుంది. అందులో కొందరు మరణిస్తారు.

* జ‌నాల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనాలు మరణిస్తారు. జంతువులూ అలాగే చనిపోతాయి.

* దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దాంట్లో చిక్కుకుని మరణిస్తారు. ప్రధానమైన 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి.

* కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో 1 రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనాలు అరచి అరచి చనిపోతారు.

* 5వేల ఏళ్ళ తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమ‌వుతుంది. గ్రామాల్లో దొంగ‌త‌నాలు పెరిగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version