కన్నడ తప్ప మరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలి : సీఎం సిద్ధరామయ్య

-

కన్నడ భాష, ప్రాంతం, నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కన్నడ వాసికి ఉందని ,రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.రాష్ట్రంలో నివసించే వారంతా స్థానిక భాషను నేర్చుకోవాలని ఆయన సూచించారు.

”కన్నడిగులు ఉదారంగా ఉండడంతో కన్నడ రాకున్నా.. ఇతర భాషలు మాట్లాడేవారు ఇక్కడ స్వేచ్ఛగా నివసిస్తున్న వాతావరణం ఉంది. కన్నడ మీద ప్రేమ పెంచుకోవాలి అని అన్నారు.ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మతోన్మాదులుగా మారకూడదు అని సూచించారు. భాష, ప్రాంతం, దేశం మీద ప్రేమ, గౌరవం పెంచుకోవాలి. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అందుకోసం రాష్ట్రంలో నివసించే వారంతా కన్నడ నేర్చుకోవాలి. కన్నడ తప్ప మరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలి” అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌, కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాళ్ల మాతృభాషలోనే మాట్లాడుతారని.. ఇక్కడ కూడా స్థానిక భాషలోనే మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version