ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగిస్తోంది. ఇప్పటికే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక స్కాలర్‌షిప్ స్కీమ్‌గా మార్చేసిన విషయం తెలిసిందే.
అలాగే ఎస్సీల విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా ,వైఎస్సార్ విద్యోన్నతి పథకాన్ని ఎన్‌టీఆర్ విద్యోన్నతిగా,వైఎస్సార్ కల్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సహాకాలుగా మారుస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్సార్ బీమా పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ బీమాకు చంద్రన్న బీమాగా పేరును మార్చింది. 2014-19 మధ్య కాలంలో చంద్రన్న బీమా పేరుతో పథకం అమలు అయిన విషయం తెలిసిందే.