హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందులోని వందల ఎకరాల్లోని చెట్లను రాత్రికి రాత్రే జేబీసీ సాయంతో నరికివేయించింది.
దీంతో అందులోని వన్యప్రాణులు ఎక్కడకు వెళ్లాలో తెలియక హెచ్‌సీయూ ప్రాంగణాల్లో సంచరిస్తున్నాయి. అంతేకాకుండా జనావాసాల్లోకి వెళ్తున్నాయి. ఇటీవల కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిందని విద్యార్థులు వీడియో సైతం రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఈ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.అయితే, ఈ వివాదంపై దేశరాజధాని ఢిల్లీలో సేవ్ హెచ్‌సీయూ పేరిట పోస్టర్లు వెలిశాయి. ‘రాహుల్ గాంధీ జీ.. ప్లీస్ స్టాప్ కట్టింగ్ డౌన్ అవర్ జంగిల్స్ ఇన్ తెలంగాణ’ అంటూ తాజిందర్ బగ్గా అనే వ్యక్తి వాటిని అంటించినట్లు తెలుస్తోంది.