రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా లాభాలను మనం పొందేందుకు అవుతుంది. అయితే రైతుల కోసం తీసుకు వచ్చే స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఒకటి. దీనితో రైతులకి చక్కటి ప్రయోజనాలు అందుతున్నాయి.
రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున పొందొచ్చు. మూడు విడతల్లో రూ.2000 చొప్పున ఖాతాల్లో పడతాయి. ఇక ఇప్పుడు 12వ విడత డబ్బులు రానున్నాయి. మరి అవి ఎపుడు వస్తాయి అనేది చూస్తే..సెప్టెంబర్ చివరి నాటికి ఈ డబ్బులు వస్తాయని అన్నారు కానీ రాలేదు.
ఆ తరవాత అక్టోబర్ 2 రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు పడతాయన్నారు. కానీ రాలేదు. తాజాగా రైతుల అకౌంట్ లోకి డబ్బులు అక్టోబర్ 10వ తేదీలోపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది అన్నదాతలకు గుడ్ న్యూస్ ఏ. మరి డబ్బులు అక్టోబర్ 10వ తేదీలోపు వస్తాయో లేదో చూడాల్సి వుంది. ఏ తేదీన రైతు ఖాతాల్లో డబ్బులు పడతాయనేది కేంద్రం అధికారికంగా వెల్లడించలేదు.
మీ అకౌంట్ ని ఎలా చెక్ చేసుకోవాలి..?
దీని కోసం ముందు మీరు అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి
నెక్స్ట్ మీరు ‘ఫార్మర్స్ కార్నర్’ సెలెక్ట్ చేసుకోవాలి.
‘బెనిఫిషియరీ స్టేటస్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నుండి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేటాపై క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి.