కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ముఖ్యంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ రైతులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం ద్వారా మోదీ సర్కార్ నేరుగా రైతులకు ఆర్థిక తోడ్పాటు ఇస్తోంది. ఈ పధకం లో రైతులు ఇంకా చేరకపోయి ఉంటే ఈ స్కీమ్ లో చేరడం మంచిది. ఎందుకంటే ఈ స్కీమ్ వలన రైతులకి ఆర్ధికంగా బెనిఫిట్ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేలు వస్తాయి. ఐతే ఈ డబ్బు అంతా ఒకేసారి రావు. ఈ డబ్బులు విడతల వారీగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.6 వేలు రైతులకి ఇస్తున్నారు. ఇప్పటి వరకు అయితే రైతులకి 9 విడతల డబ్బులను కేంద్రం ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు పదో విడత డబ్బులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. పీఎం కిసాన్ పదో విడత డబ్బులు ఈ నెల చివరి కల్లా రావచ్చు. లేదంటే వచ్చే నెల తొలి అర్ధ భాగంలో అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ డబ్బులు గురించి కేంద్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరితే మీకు కూడా డబ్బులు వస్తాయి.