కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తో రైతులకి ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసినదే. ఈ పీఎం కిసాన్ స్కీమ్ లో మీరు కూడా చేరారా..? అయితే తప్పకుండ మీరు ఈ విషయాల్ని తెలుసుకోవాలి. పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారి లో 33 లక్షల మంది ఇప్పుడు అనర్హులుగా తేలారు. ఈ 33 లక్షల మందికి ఇక పై పీఎం కిసాన్ డబ్బులు రావు అని స్పష్టం అయింది. అయితే ఇప్పటి దాకా దీని కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తూ వస్తోంది.
ఇప్పటికే రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఇది ఇలా ఉండగా పీఎం కిసాన్ స్కీమ్ ని తీసుకు వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. అయితే కొంత మంది రైతులు అర్హత లేకున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీనితో మొత్తంగా దాదాపు 33 లక్షల మంది అనర్హులుగా తేలారు. వీళ్ళకి మోదీ ఇస్తున్న రూ.6,000 ఇక అందవు.
అయితే మరి మీరు అర్హులా కాదా… ? అనేది ఎలా చూడొచ్చు అంటే మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దానిని ఓపెన్ చేసాక బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలని అక్కడ ఎంటర్ చేసి దాని సాయంతో మీరు లిస్ట్ పొందొచ్చు. ఆ లిస్ట్ మీ పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి. అదే లేకపోతే రానట్టే.