లేటెస్ట్ అప్డేట్స్: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఎనిమిదవ విడత గురించి వివరాలు ఇవే..!

-

రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. రైతులకు రూ. 6000 ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. రైతులకు ఈ స్కీమ్ కింద మూడు విడతల్లో ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల్ని పంపిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నేరుగా విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. త్వరలో ఎనిమిదవ విడతని కూడా రైతులకు కేంద్రం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

PM KISANతాజాగా వచ్చిన సమాచారం మేరకు ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లోకి మార్చి 31వ తేదీకి డబ్బులు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద డబ్బులు అందడానికి 10 రోజులు పడతాయి. దీనితో ఏప్రిల్ 10వ తేదీన నాటికి రైతుల ఖాతా లోకి డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 11 కోట్ల 71 లక్షల రైతులు చేరారు. ఈ స్కీమ్ కింద ఎవరు అర్హులు అనేది కూడా తెలుసుకోవచ్చు.

అలానే ఇప్పటి వరకు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ని అందుకున్నారు, పెండింగ్ స్టేటస్ వంటివి కూడా చూడొచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్స్టాల్మెంట్ డబ్బులు పడక పోతే మరొక ఇన్స్టాల్మెంట్ లో మీరు ఈ స్కీమ్ కింద పెట్టుకోవచ్చు. దీని కోసం మీరు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ మీద క్లిక్ చేయండి. అక్కడ సెక్షన్ లో బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు కొత్త పేజీ తెరుచుకుంటుంది.

ఇప్పుడు ఈ కొత్త పేజీ లో ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మీకు మీ అకౌంట్ లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది తెలుస్తుంది. అక్కడ ఉన్న ఆప్షన్స్ మీరు ఫిల్ చేసాక గెట్ డేటా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన డేటా వస్తుంది. ఈ ఎనిమిది విడత కి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. అక్కడ FTO జనరేట్ అయి పేమెంట్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ పెండింగ్ అని వస్తే మీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు కొద్ది రోజుల్లో మీ డబ్బులు వచ్చేస్తాయి అని.

Read more RELATED
Recommended to you

Exit mobile version