రైతులకు అలర్ట్‌.. మరో రెండు రోజులే గడువు..

-

ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద 12వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. అయితే, ఈ నిధులు విడుదల కావాలంటే eKYC చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ-కేవైసీ ఫైలింగ్‌ గడువును ఇప్పటికే చాలా సార్లు పొడిగించిన కేంద్రం.. ఈసారి పెంచే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. కాగా, పీఎం కిసాన్ పథకానికి ఈ కేవైసీ ఫైల్ చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువు లోగా ఈ కేవైసీ పూర్తి చేస్తేనే 12వ విడుత నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ నమోదిత రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత eKYC పీఎంకిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.

లేదంటే బయోమెట్రిక్ ద్వారా eKYC నమోదు చేయడం కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఎవరైతే పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హులై ఉండి, ఇప్పటికీ e-KYC ప్రక్రియను పూర్తి చేయని వారు ఈ రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. e-KYCకి చివరి తేదీ జూలై 31, 2022. అంతకుముందు, గడువు మే 31, 2022 కాగా ప్రభుత్వం దానిని పొడిగించింది. అంతే కాకుండా OTP ప్రమాణీకరణ ద్వారా ఆధార్ ఆధారిత eKYCని కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version