బొమ్మల ఎగుమతులు భారీగా పెరిగాయ్: మోడీ

-

ఆటబొమ్మల ఎగుమతిలో భారత్​ పవర్‌హౌస్‌గా.. ఆటబొమ్మల ఎగుమతిలో ఇండియా పవర్‌హౌస్‌గా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. నేడు నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బొమ్మల ఎగుమతి రూ.300-400 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరిందని పేర్కొన్నారు మోడీ. భారతీయ పురాణాలు, చరిత్ర, సంస్కృతి ఆధారంగా తయారీదారులు ఇప్పుడు ఆట బొమ్మలను తయారు చేస్తున్నారని, వాటి నుంచి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారన్నారు మోడీ. అవే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయని, మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2నే అని ప్రధాని గుర్తుచేశారు.

త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు స్మరించుకున్నారు మోడీ. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం ఒక సామూహిక ఉద్యమంగా మారుతోందని, అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆగస్టు 2 నుంచి 15 వరకు.. ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్​గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవాలని మోదీ కోరారు. ఈ మేరకు మన్​కీ బాత్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్​కు ఆయన నివాళులర్పించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version