ఇది కాంగ్రెస్‌ పార్టీ కొత్త వ్యూహం : మోడీ

-

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోడీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా తనను దుర్భాషలాడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మౌనంగా ఉంటూ కొత్త వ్యూహాలు పన్నుతోందని ప్రధాని మోడీ ఆరోపించారు. తనను వేధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంట్రాక్టును ఔట్ సోర్సింగ్ కు ఇచ్చిందని విమర్శించారు ప్రధాని మోడీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో విస్తృతంగా పర్యటిస్తూ మోడీపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

20 ఏళ్లుగా గుజరాత్ కు వ్యతిరేకంగా పనిచేసి వారు ఇప్పుడు రాష్ట్రం పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీ వ్యూహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఇన్నాళ్లూ తనను దారుణంగా దుర్భాషలాడారని.. ఇప్పుడు మౌనంగా గ్రామాలకు వెళ్లి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ. ఈ క్రమంలో తనను వేధించేందుకు ఆప్ కు కాంట్రాక్టు ఇచ్చారని.. గుజరాత్ లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version