వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఎట్టకేలకు మళ్లీ ఖరారు అయింది. ఈ నెల 8వ తేదీన మోదీ హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న మోదీ మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. ఈ రెండు గంటల్లో మోదీ ఎక్కడెక్కడికి వెళ్తారు.. ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు అనే విషయంపై షెడ్యూల్ ఖరారైంది.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్..
11.30: బేగంపేట విమానాశ్రయానికి రాక
11.45: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరిక
11.45-12.00: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభం
12.15: పరేడ్ గ్రౌండ్‌కు చేరిక
12.18-1.20: శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం, బహిరంగ సభ, 1:30: బేగంపేట నుంచి తిరుగుప్రయాణం
మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సమాయత్తమయ్యారు. అయితే మోదీ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొనే అవకాశం లేనట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షా ప్రశ్నాల లీకేజీ వ్యవహారంలో సంజయ్ కు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.